Home Business Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?.. బిల్లు చెల్లింపుల గడువు అర్థం...

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?.. బిల్లు చెల్లింపుల గడువు అర్థం కావడం లేదా? ఇలా చెక్‌ చేసుకోండి!

73
0

మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ప్రతి నెలా దాని స్టేట్‌మెంట్‌ను పొందవలసి ఉంటుంది. మీ కార్డ్ స్టేట్‌మెంట్ కొందరికి అర్థం కాదు. ప్రతి నెలా మీ కార్డ్‌లోని లావాదేవీ వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్..

మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ప్రతి నెలా దాని స్టేట్‌మెంట్‌ను పొందవలసి ఉంటుంది. మీ కార్డ్ స్టేట్‌మెంట్ కొందరికి అర్థం కాదు. ప్రతి నెలా మీ కార్డ్‌లోని లావాదేవీ వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ రూపంలో వస్తాయి. అందులో చాలా వివరాలు ఉన్నాయి. దీన్ని చూడటం ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులోని లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు. మీరు వాడుకున్న డబ్బును స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చు చేశారని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఏదైనా అనుమానం ఉండే వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

ఒక వేళ మీరు నెట్‌ బ్యాంకింగ్‌లో కూడా చెక్‌ చేసుకోవచ్చు. మీ బిల్లు ఎప్పుడు జనరేట్‌ అవుతుందా..? బిల్లు చెల్లించేందుకు చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలు కనిపిస్తాయి. చాలా మందికి బిల్లు చెల్లించేందుకు ఎప్పుడు చివరి తేదీ అనే విషయాలు పెద్దగా గమనించి ఉండరు. క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వాడేవారికి అవగాహన ఉంటుంది. కొత్తగా కార్డు తీసుకున్న వారికి అవగాహన ఉండకపోవడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. గడువు తేదీ ముందస్తుగా గుర్తించుకోకపోవడంతో వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అనదపు ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ని స్టేట్‌మెంట్ సైకిల్ అని కూడా అంటారు. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అయిన రోజు నుండి బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉంటుంది.

చెల్లింపు గడువు తేదీ: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపునకు ఇదే చివరి తేదీ. ఈ తేదీ తర్వాత చేసే చెల్లింపులపై రెండు రకాల ఛార్జీలు ఉన్నాయి. ముందుగా బకాయి మొత్తం చెల్లించాలి. లేదా ఆలస్య చెల్లింపు రుసుము చెల్లించాలి. దీనిని మినిమమ్‌ అమౌంట్‌ కూడా అంటారు. ఇది చెల్లిస్తే మీకు వచ్చే బిల్లు వరకు వాడుకున్న బాకాయిని చెల్లించవచ్చు. అప్పటి వరకు మీకు ఎలాంటి అదనపు రుసుము పడదని గుర్తించుకోవాలి. మీరు ప్రతి నెలా మొత్తం బకాయి మొత్తాన్ని చెల్లించాలి. తద్వారా అదనపు ఛార్జీలు ఉండవు. మొత్తం మొత్తంలో బిల్లింగ్ సైకిల్ సమయంలో అయ్యే ఛార్జీలతో పాటు అన్ని ఈఎంఐలు ఉంటాయి.

Previous articleనిద్ర లేమితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు..
Next articleలేనిపోని తలనొప్పులు తెచ్చుకోకండి.. వీటికి దూరంగా ఉండండి
చందృశేఖర్ అవినాష్ తెలుగు వెబ్ మీడియా డాట్ కామ్ వెబ్సైట్‌లో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఎడిటింగ్ నైపుణ్యాలు మరియు విశ్లేషణాత్మక దృక్పధం తెలుగు వెబ్ మీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యక్తిగత వివరాలు: చందృశేఖర్ అవినాష్ మహారాష్ట్ర, ముంబైలో నివసిస్తున్నారు. పార్థివాడ, చకలాలో ఉంటారు. విద్య మరియు ప్రొఫెషనల్ ప్రస్థానం: చందృశేఖర్ అవినాష్ తన విద్యను ముంబైలో పూర్తిచేసి, ఎడిటర్‌గా తన ప్రొఫెషనల్ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన తెలుగు సాహిత్యానికి, మీడియా పరిశ్రమకు అందించిన సేవలు అమోఘం. వివిధ విషయాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, శోధనాత్మక రిపోర్టులు అందించడం ద్వారా పాఠకులకు విలువైన సమాచారం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.