Home News స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?

స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?

84
0

టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించిన కొత్త చిత్రం ‘నో వే హోమ్’ భావోద్వేగాలతో నిండి, స్ఫూర్తినిచ్చే ట్విస్ట్‌తో ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

ఒక చిన్న క్విజ్ మీకోసం: గత 20 ఏళ్లల్లో ఎన్ని స్పైడర్ మ్యాన్ సినిమాలు వచ్చాయి? నా లెక్క ప్రకారం, టోబే మాగ్వైర్ నటించి, సామ్ రైమి దర్శకత్వం వహించినవి మూడు సినిమాలు, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్‌గా మార్క్ వెబ్ దర్శకత్వంలో వచ్చినవి రెండు, ఒక యానిమేషన్ చిత్రం ‘ఇన్‌టు ది స్పైడర్ వర్స్’, టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా జాన్ వాట్స్ ​ తీసిన ఇటీవలి చిత్రాలు రెండు.

టామ్ హాలండ్, జాన్ వాట్స్ కాంబినేషన్‌లో వచ్చిన మూడవ చిత్రం ‘నో వే హోమ్’. దీంతో, తొమ్మిదోసారి పీటర్ పార్కర్.. స్పైడర్ మ్యాన్ బట్టలేసుకుని సాహసాలు చేసి ప్రేక్షకులను అలరించడం. ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికాలో కూడా స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు. కానీ, అవి లెక్కలోకి తీసుకోలేదు. ఇన్ని చూశాం, చాలనిపిస్తుంది. అక్కడే, నో వే హోమ్ మ్యాజిక్ చేసింది. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలన్నింటినీ తెలివిగా ఇందులో వాడుకున్నారు.

పాత స్పైడర్ మ్యాన్ సినిమాలన్నింటినీ మళ్లీ గుర్తు చేసుకోవడం ప్రేక్షకులకు సరదాగానూ ఉంటుంది, కొత్త చిత్రానికి కావలసిన భావోద్వేగాలనూ నింపింది. అలాగే, పాత చిత్రాలకు కొత్త కోణాలను జోడిస్తుంది. దానివల్ల, గతంలో వచ్చిన చిత్రాలు ఇంకా మెరుగుపడినట్లు మనకు తోస్తుంది. అయితే, సూపర్ హీరో సంశయాత్ములు ఒప్పుకోకపోవచ్చు. కానీ, సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘నో వేహోమ్’ చూస్తున్నంతసేపు పెదవుల మీద ఓ సన్నని చిరునవ్వు, బహుసా కొన్ని కన్నీటి చుక్కలు కచ్చితంగా అనుభవంలోకి వస్తాయి.

Previous articleఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం… – teluguwebmedia.com
Next articleAustralia: భూమిలో 200 అడుగుల లోతున 1300 కాళ్ల ప్రాణి
చందృశేఖర్ అవినాష్ తెలుగు వెబ్ మీడియా డాట్ కామ్ వెబ్సైట్‌లో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఎడిటింగ్ నైపుణ్యాలు మరియు విశ్లేషణాత్మక దృక్పధం తెలుగు వెబ్ మీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యక్తిగత వివరాలు: చందృశేఖర్ అవినాష్ మహారాష్ట్ర, ముంబైలో నివసిస్తున్నారు. పార్థివాడ, చకలాలో ఉంటారు. విద్య మరియు ప్రొఫెషనల్ ప్రస్థానం: చందృశేఖర్ అవినాష్ తన విద్యను ముంబైలో పూర్తిచేసి, ఎడిటర్‌గా తన ప్రొఫెషనల్ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన తెలుగు సాహిత్యానికి, మీడియా పరిశ్రమకు అందించిన సేవలు అమోఘం. వివిధ విషయాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, శోధనాత్మక రిపోర్టులు అందించడం ద్వారా పాఠకులకు విలువైన సమాచారం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.