Home క్రీడలు Liverpool Football Club: ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్‌పై కన్నేసిన ముఖేష్ అంబానీ.. ధర తెలిస్తే కళ్లు...

Liverpool Football Club: ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్‌పై కన్నేసిన ముఖేష్ అంబానీ.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

92
0

Mukesh Ambani: ఐపీఎల్ స్టార్ టీమ్ ముంబై ఇండియన్స్ యజమాని ముఖేష్ అంబానీ తాజాగా ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఇంగ్లీష్ క్లబ్ ధర ముంబై ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువగా ఉంది.

ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్న భారతీయ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వ్యాపారంతో పాటు క్రీడలపై కూడా చాలా ఆసక్తి ఉందనే విషయం తెలిసిందే. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) జట్టును కొనుగోలు చేశాడు. దీనితో పాటు అతను ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో కూడా దూకుడు పెంచేస్తు్న్నాడు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ .. తాజాగా ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మిర్రర్ ప్రకారం, లివర్‌పూల్ క్లబ్‌ ప్రస్తుతం ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ (FSG) యాజమాన్యంలో ఉంది. ఈ క్లబ్ కోసం 4 బిలియన్ పౌండ్ల (సుమారు 381 బిలియన్ రూపాయలు) ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

లివర్‌పూల్ విలువ ఎంఐ కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ..

ఈ విలువ IPL ముంబై ఫ్రాంచైజీ కంటే చాలా రెట్లు ఎక్కువ. ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.2500 కోట్లు లేదా రూ.25 బిలియన్లుగా అంచనా వేశారు. ఇటువంటి పరిస్థితిలో లివర్‌పూల్‌ను కొనుగోలు చేసేందుకు MI కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

లివర్‌పూల్ క్లబ్‌ను కొనుగోలు చేసే రేసులో అంబానీ ఒక్కడే కాదు.. మిడిల్ ఈస్ట్, USAతో పోటీపడనున్నారు. ముకేశ్ అంబానీ ఈ డీల్‌ను పూర్తి చేస్తే.. ఇంగ్లండ్‌లో భారత్‌ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ సుమారు $ 95 బిలియన్లుగా ఉంది.

ఇంగ్లీష్ క్లబ్ లివర్‌పూల్ ఎంత పెద్దది..

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్‌ను ది రెడ్స్ అని కూడా పిలుస్తారు. క్లబ్ UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను 6 సార్లు గెలుచుకుంది. జట్టు UEFAలో మూడుసార్లు ఛాంపియన్‌గా కూడా ఉంది. లివర్‌పూల్ డొమెస్టిక్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో టైటిల్‌ను గెలుచుకుంది. అత్యధిక సార్లు 19 సార్లు గెలిచింది. మాంచెస్టర్ యునైటెడ్ వారి కంటే కేవలం ఒక్క టైటిల్‌తో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత EPL సీజన్‌లో ఇప్పటివరకు లివర్‌పూల్ పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.

లివర్‌పూల్ క్లబ్ స్టార్ ప్లేయర్..

ఈ ఇంగ్లీష్ క్లబ్‌లో స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్‌లు మొహమ్మద్ సలా, రాబర్ట్ ఫిర్మినో, లూయిస్ డియాజ్, డియెగో జాటా, మిడ్‌ఫీల్డర్లు ఫాబిన్హో, జేమ్స్ మిల్నర్ ఉన్నారు. జట్టు డిఫెండింగ్ బలంలో వర్జిల్ వేన్ డిక్, ఇబ్రహీం కొనాట్, ఆండీ రాబర్ట్‌సన్ వంటి స్టార్ డిఫెండర్లు ఉన్నారు. ఈ జట్టులో స్టార్ గోల్‌కీపర్ కావోమ్‌హిన్ కెల్లెహెర్ కూడా ఉన్నాడు.

Previous articleలేనిపోని తలనొప్పులు తెచ్చుకోకండి.. వీటికి దూరంగా ఉండండి
Next articleరాత్రి భోజనం తర్వాత ఈ వ్యాయామం చేయడం వల్ల మీరు రెట్టింపు బరువు తగ్గుతారు
రాజ్దేవ్ కుమార్ తెలుగు వెబ్ మీడియా డాట్ కామ్ వెబ్సైట్‌కి నిర్మాతగా పనిచేస్తున్నారు. తన క్రియేటివ్ మరియు రచనా నైపుణ్యాలతో, తెలుగు సాహిత్యం మరియు మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యక్తిగత వివరాలు: రాజ్దేవ్ కుమార్ భారతదేశంలోని మహారాష్ట్ర, ముంబైలో నివసిస్తున్నారు. పార్థివాడ, చకలాలో నివాసం ఉంటున్నారు. విద్య మరియు ప్రొఫెషనల్ ప్రస్థానం: రాజ్దేవ్ కుమార్ తన విద్యను ముంబైలో పూర్తిచేసి, రచయితగా మరియు నిర్మాతగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన రచనల ద్వారా పాఠకులకు వివిధ అంశాలపై మంచి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.