ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.
IPL2022 Delhi Capitals Vs MI : ముంబై ఇండియన్స్ గెలిచింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మురిసింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ ని కూడా తీసుకెళ్లింది. ఢిల్లీ ఓటమితో బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొంది ఉంటే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకునేది. కానీ కీలక మ్యాచ్‌లో ఢిల్లీ తడబడింది. 160 పరుగులను కాపాడుకోవడంలో విఫలమై ఓటమితో ఇంటిముఖం పట్టింది.