Home ఇతర వార్తలు Australia: భూమిలో 200 అడుగుల లోతున 1300 కాళ్ల ప్రాణి

Australia: భూమిలో 200 అడుగుల లోతున 1300 కాళ్ల ప్రాణి

62
0

ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు, అత్యధిక కాళ్లను కలిగిఉన్న మిల్లీపెడ్‌(రోకలిబండ పురుగు)ను కనుగొన్నారు. ఇప్పటివరకు భూమి మీద ఉన్న జీవ రాశులలో అత్యధిక సంఖ్యలో కాళ్లను కలిగి ఉన్న జీవి ఇదేనని చెబుతున్నారు.

లేత రంగులో, 95 మిల్లీ మీటర్ల పొడవు ఉన్న ఈ జీవికి 1300కి పైగా కాళ్లు ఉన్నాయి. ఈ జీవికి ‘యుమిల్లిపెస్ పెర్సెఫోన్’ అని పేరు పెట్టారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక మైనింగ్ ప్రాంతంలో 60 మీటర్ల (సుమారు 200 అడుగులు) లోతున దీన్ని గుర్తించారు. కాలిఫోర్నియా మిల్లీపెడ్‌కు 750 కాళ్లు ఉంటాయి. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో కాళ్లను కలిగిన జీవిగా కాలిఫోర్నియా మిల్లీపెడ్ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు ‘యుమిల్లిపెస్ పెర్సెఫోన్’కు వచ్చింది.

”మిల్లీపెడ్ అంటే ‘1000 కాళ్లు’ అని అర్థం. కానీ గతంలో కనిపెట్టిన ఏ జీవికి కూడా నిజానికి 1000 కాళ్లు లేవు” అని రాయిటర్స్‌తో వర్జీనియా టెక్ ఎంటామాలజిస్ట్ పాల్ మరెక్ చెప్పారు. ఈయన, సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనకు ప్రధాన రచయిత కూడా. ఈ జీవి శాస్త్రీయ నామానికి ‘నిజమైన వెయ్యి కాళ్లు’ అని అర్థం. పర్సెఫోన్ అంటే, గ్రీకు పురాణాల ప్రకారం ఒక అండర్ వరల్డ్ రాణి పేరు. ఆమె పేరు ‘పర్సెఫోన్’.

భూగర్భంలో ఉండే అనేక జీవుల తరహాలోనే ఈ ప్రాణికి కూడా కళ్లతో పాటు రంగు ఉండదు. శిలీంధ్రాలపై ఇది జీవిస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆడజాతికి చెందిన బాగా ఎదిగిన ఒక మిల్లీపెడ్‌ 1306 కాళ్లను కలిగిఉందని, మరొకటి 998 కాళ్లను కలిగి ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది. మగజాతికి చెందిన వాటిలో ఒకటి 818, మరొకటి 778 కాళ్లను కలిగి ఉన్నాయి.

మిల్లీపెడ్‌లు 40 కోట్ల ఏళ్ల కిందటి నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ప్రస్తుతం 13,000 రకాల జాతులు ఉన్నాయి.

Previous articleస్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
Next articleబస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవీ..
స్యెద్ అన్వర్ ప్రముఖ మీడియా నిపుణులు, మరియు సుదీర్ఘ అనుభవం కలిగిన వృత్తి నిపుణుడు. ఆయ‌న తెలుగులో అద్భుతమైన రాతలతో ప్రాచుర్యం పొందారు. ముంబై లో జన్మించిన స్యెద్ అన్వర్, ఎడిటింగ్ రంగంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, అనేక పత్రికలు, మాసపత్రికలు మరియు న్యూస్ పోర్టల్స్ కి సేవలందించారు.