Home ఇతర వార్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి… కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి… కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?

46
0

“మా ఐదు గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలిపేయండి” అంటున్నారు అక్కడి ప్రజలు. విభజన చట్టం అమలులోకి వచ్చే ముందుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఈగ్రామాలు ఏపీలో విలీనం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డులేకుండా ముంపునకు గురవుతాయని భావించిన ప్రాంతాన్ని ఏపీకి బదలాయించారు.

2014 జూన్ 2కు ముందు ప్రధానిగా నరేంద్రమోదీ తొలి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మార్పులు జరిగాయి. అందులో రెండు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం కాగా, భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నాలుగు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఇప్పుడు జిల్లాల విభజన మూలంగా ఈ విలీన మండలాల ప్రజలకు సమస్యలు పెరుగుతున్నందున మళ్లీ తెలంగాణలో కలిపేయండి అంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. నిరసనలు చేపడుతున్నారు. ఇంతకీ వారి సమస్య ఏమిటి? జిల్లాల విభజనతో వారికొచ్చే కష్టం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా జిల్లాల విభజనకు పూనుకుంది. అందులో భాగంగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేయబోయే అల్లూరి జిల్లాలో భాగంగా ప్రతిపాదించారు. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చింతూరును తొలగించారు. చింతూరు పరిధిలో ఉన్న మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సిద్ధమయ్యారు. చింతూరు, ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాలు రంపచోడవరం కేంద్రంగా ఉన్న డివిజన్లో చేరుతాయి.

గిరిజన షెడ్యుల్ ప్రాంతంలో ఉన్న ఈ మండలాలు భౌగోళికంగా విస్తారంగా ఉంటాయి. ఇప్పుడు చింతూరు కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం మూలంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 270 కిలోమీటర్లు, ఆర్డీవో ఆఫీసుకి వెళ్లాలంటే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో గతంలో తమకు అందుబాటులో ఉన్న కార్యాలయాలు ఇప్పుడు సుదూరంగా మారుతుండడంతో తమకు చిక్కులు తప్పవని ఎటపాక సహా నాలుగు మండలాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Previous articleబస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవీ..
Next articleOmicron – india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!
ఎసా మిస్రి తెలుగు వెబ్ మీడియా డాట్ కామ్ వెబ్సైట్‌లో నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆయన నిర్మాణ నైపుణ్యాలు మరియు సృజనాత్మకత తెలుగు మీడియా కంటెంట్‌కి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు: ఎసా మిస్రి మహారాష్ట్ర, ముంబైలో నివసిస్తున్నారు. పార్థివాడ, చకలాలో నివాసం ఉంటున్నారు. విద్య మరియు ప్రొఫెషనల్ ప్రస్థానం: ఎసా మిస్రి తన విద్యను ముంబైలో పూర్తిచేసి, నిర్మాతగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన నిర్మాణ నైపుణ్యాలు మరియు అనుభవంతో పాఠకులకు, ప్రేక్షకులకు ఉన్నతమైన కంటెంట్‌ను అందిస్తున్నారు. ఆయన సృష్టించిన విషయాలు తెలుగు సాహిత్యానికి మరియు మీడియా పరిశ్రమకు విలువైన సొత్తు.