Home ఆరోగ్యం Lower Blood Pressure: మహిళలకు వయసుతో సంబంధంలేకుండా హార్ట్‌ ఎటాక్ ఎప్పుడైనా రావచ్చు! ఎందుకంటే..

Lower Blood Pressure: మహిళలకు వయసుతో సంబంధంలేకుండా హార్ట్‌ ఎటాక్ ఎప్పుడైనా రావచ్చు! ఎందుకంటే..

150
0

పురుషుల కంటే స్త్రీలలోనే బ్లడ్‌ ప్రెజర్‌ తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణ భాషలో చెప్పాలంటే తక్కువ రక్తపోటు పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడింది. రక్తపోటు లెక్కించడంలో సిస్టోలిక్ ప్రెజర్ కీలకమైనది. గుండె కొట్టుకునేటప్పుడు..

పురుషుల కంటే స్త్రీలలోనే బ్లడ్‌ ప్రెజర్‌ తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణ భాషలో చెప్పాలంటే తక్కువ రక్తపోటు పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడింది. రక్తపోటు లెక్కించడంలో సిస్టోలిక్ ప్రెజర్ కీలకమైనది. గుండె కొట్టుకునేటప్పుడు ధమనుల్లో బ్లడ్‌ ఫోర్స్‌ (రక్త సరఫరా శక్తి)ను బట్టి దీనిని లెక్కించడం జరుగుతుంది.

స్మిడ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోని కార్డియాలజీ విభాగంలో కార్డియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డైరెక్టర్ సుసాన్ చెంగ్ ఏమంటున్నారంటే.. తక్కువ బ్లడ్‌ప్రజర్‌ మహిళ ఆరోగ్యానికి మరింత హానితలపెడుతుంది. లింగ బేధాన్ని పరిగణనలోకి తీసుకోని రక్తపోటు విధివిధానాలపై చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో భాగంగా నాలుగు కమ్యునిటీలకు చెందిన రక్త నమూనాలను పరిశోధకులు పరీక్షించారు. ఈ పరిశోధనలో 27,000కు పైగా మంది పాల్గొన్నారు. వీరిలో 54 శాతం మంది మహిళలు. రక్తపోటులో ఈ విధమైన వ్యత్యాసాలు అధిక రక్తపోటుకు దారితీస్తాయి. ఈ విధమైన పరిస్థితి హార్ట్‌ ఎటాక్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌, హార్ట్‌ స్ట్రోక్ వంటి గుండె సంబందిత వ్యాధులకు దారితీస్తుంది. గుండె జబ్బులు పురుషుల కంటె మహిళలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు మా పరిశోధనల్లో బయటపడింది.

తక్కువ రక్తపోటు ఉండే మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఐతే ఈ విధమైన గుండె జబ్బులు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే మహిళలు/పురుషుల్లో రక్తపోటు ఎల్లప్పుడు సాధారణ స్థితిలో ఉండేలా కాపాడుకోవాలి. పురుషుల్లో బ్లడ్‌ ప్రెజర్‌ 120 mmHg, మహిళల్లో 110 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉంటే గుండె జబ్బుల బారీన పడే అవకాశం ఉన్నట్లు మా అధ్యయనంలో గుర్తించాం. సాధారణంగా సిస్టోలిక్ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలు గుండె సమస్యలతో ముడిపడి ఉంటాయి. పరిమితికంటే అధక స్థాయిలో సిస్టోలిక్ బ్లడ్‌ ప్రెజర్‌ ఉంటే హార్ట్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు సులువుగా అభివృద్ధి చెందుతాయి.

Previous articleT20 Batsman Rankings: నం.2లో టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్..
Next articleనిద్ర లేమితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు..
రాజ్దేవ్ కుమార్ తెలుగు వెబ్ మీడియా డాట్ కామ్ వెబ్సైట్‌కి నిర్మాతగా పనిచేస్తున్నారు. తన క్రియేటివ్ మరియు రచనా నైపుణ్యాలతో, తెలుగు సాహిత్యం మరియు మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యక్తిగత వివరాలు: రాజ్దేవ్ కుమార్ భారతదేశంలోని మహారాష్ట్ర, ముంబైలో నివసిస్తున్నారు. పార్థివాడ, చకలాలో నివాసం ఉంటున్నారు. విద్య మరియు ప్రొఫెషనల్ ప్రస్థానం: రాజ్దేవ్ కుమార్ తన విద్యను ముంబైలో పూర్తిచేసి, రచయితగా మరియు నిర్మాతగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన రచనల ద్వారా పాఠకులకు వివిధ అంశాలపై మంచి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.